కడపలో పట్టపగలే వైసీపీ కార్యకర్త దారుణహత్య

  • జిమ్ నుంచి ఇంటికి వెళ్తున్న శ్రీనివాసులురెడ్డిపై కత్తితో దాడి
  • బురఖాలో వచ్చి విచక్షణ రహితంగా పొడిచిన నిందితులు
  • భూతగాదాలే కారణమని అనుమానం
కడపలో పట్టపగలే.. అందరూ చూస్తుండగానే వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. భూతగాదాలే ఇందుకు కారణమని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. కడపకు చెందిన శ్రీనివాసులురెడ్డికి, మరికొందరికి మధ్య గత కొంతకాలంగా భూతగాదాలు ఉన్నాయి. ఇవి మరింత ముదరడంతో శ్రీనివాస్‌రెడ్డిపై కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు అతడి హత్యకు ప్లాన్ చేశారు. 

ఈ ఉదయం జిమ్ నుంచి ఇంటికి వెళ్తున్న శ్రీనివాసులుపై బురఖా ధరించిన ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడిచేసి, విచక్షణ రహితంగా గాయపరిచారు. రక్తపు మడుగులో కుప్పకూలిన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Kadapa
YSRCP
Crime News

More Telugu News